ఢిల్లీని వీడని పొగమంచు..

08:27 - November 13, 2017

ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దీనితో పాటు కాలుష్యం కూడా ప్రమాదకరస్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్యం..పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మందిర్ మార్గ్, ఆనంద్ విహార్, పంజాబి బాగ్, షాదీపూర్, సెంట్రల్ ఢిల్లీలో సోమవారం కాలుష్యం 500 పాయింట్లను దాటింది. దీని కారణంగా విమానాలు..రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 62 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 22 రైళ్ల సమయాల్లో మార్పులు..8 రైళ్లను అధికారులు రద్దు చేశారు.

ఇదిలా ఉంటే ఎన్జీటీలో సరి - బేసి వాహన విధానంపై పిటిషన్ పై విచారణ జరుగనుంది. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. ద్విచక్రవాహనాలు..మహిళలకు మినహాయింపు ఇవ్వాలని సర్కార్ కోరనుంది. దీనిపై ఎన్జీటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Don't Miss