'సైన్స్ కాంగ్రెస్‌లో మూఢత్వపు చర్చలా? !'

17:53 - January 2, 2017

హైదరాబాద్ : తిరుపతిలో రేపటి నుంచి జరిగే సైన్స్ కాంగ్రెస్‌లో ఆధ్యాత్మిక, మూఢనమ్మకాల పెంపు వంటి అంశాలపై చర్చించటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని సీసీఎంబీ వ్యవస్థాపకులు, ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో అశాస్త్రీయ, అసంబద్ధ అంశాలు చర్చించలేదన్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధాని కూడా హాజరవడం బాధాకరమని ఆయన అన్నారు. సదస్సులో సైన్స్, వైజ్ఞానిక అంశాలు వాటి పరిష్కారాలపై చర్చ జరగాలని కోరారు. ఆహారం, వ్యవసాయం, ప్రజారోగ్యం, సైన్స్ విద్యారంగం, జాతీయ సహజ వనరుల రక్షణ వంటి అంశాలను సైన్స్ కాంగ్రెస్ అజెండాలో చేర్చాలని భార్గవ డిమాండ్ చేశారు.

Don't Miss