'ప్రగతిభవన్‌ కొత్త ధర్నచౌక్‌గా మారింది'..

07:54 - May 16, 2018

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ను ఎత్తివేసి కేసీఆర్‌ సర్కార్‌ ఉద్యమాలు ఆపే ప్రయత్నం చేసిందనీ, కానీ ముఖ్యమంత్రి నిలయం ప్రగతిభవన్‌ కొత్త ధర్నచౌక్‌గా మారిందని పలువురు వక్తలు అన్నారు. ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఆక్యుపై చేసుకుని ఏడాది పూర్తి అయిన సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆక్యుపై ధర్నా చౌక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ ప్రజాగొంతుక ధర్నాచౌక్‌ అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది. కేసీఆర్ నిరంకుశ పాలనకు ధర్నాచౌక్‌ను మూసివేడమే నిదర్శనం అన్నారు. సర్కార్ కుట్రలను చేధించి వేలాది మందితో ధర్నాచౌక్‌ను ఆక్రమించినట్టు చాడ వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు. అసెంబ్లీ ప్రజాప్రతినిధుల వేదిక అయితే, ధర్నాచౌక్‌ ప్రజల గొంతుకకు వేదికని రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు.

 

Don't Miss