'మణిరత్నం' న్యూ ఫిల్మ్....

11:21 - October 11, 2017

మణిరత్నం...ప్రముఖ దర్శకులు. ఆయన నుండి ఎన్నో విజయంతమైన చిత్రాలు వచ్చాయి. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న వారిలో ఈయన ఒకరు. ఆయన నుండి సినిమా వస్తుందంటే ఎంతో మంది ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చివరి మూవీ 'చెలియా' ఈ సినిమా బాక్సాపీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు.

తాజాగా ఓ మూవీ ప్రాజెక్టును 'మణిరత్నం' ప్రకటించేశారు. టైటిల్ ను ఇంకా ఫైనల్ చేయలేదు. సినిమాలోని ప్రధాన తారగణం..టెక్నీషియన్స్ వివరాలను రిలీజ్ చేశారు. తన సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ పైనే ఈ చిత్రం రూపొందించనున్నారు. ప్రొడక్షన్ నెం17 అంటూ 'మణిరత్నం' కొత్త సినిమా ప్రకటన చేశారు.
ఒక్కో పాత్రకు సంబంధించిన స్కెచ్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అయపోతున్నాయి. తమిళ స్టార్లు శింబు.. విజయ్ సేతుపతి.. అరవింద్ స్వామి.. మలళయాళం నుంచి ఫదా ఫాజిల్.. ఇంకా సీనియర్ హీరోయిన్ జ్యోతిక.. అందాల భామ ఐశ్వర్యా రాజేష్ లు ఈ మూవీ ప్రధాన పాత్రధారులు. ఇక్కడ ఐశ్వర్య రాజేష్ ఎవరికి జోడీ అనేది ఇంకా తెలియరాలేదు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు. 'మణిరత్నం' సినిమాలకు సంగీతం అందించే రెహమాన్ ఈసారి కూడా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Don't Miss