నేడు సీఎం చంద్రబాబు, సీఆర్డీఏ అధికారులతో దర్శకుడు రాజమౌళి భేటీ

07:22 - December 12, 2017

గుంటూరు : సీఆర్డీఏ అధికారులు, దర్శకుడు రాజమౌళితో ఇవాళ  సీఎం చంద్రబాబు  భేటీ కానున్నారు. అమరావతి శాశ్వత భవనాల డిజైన్లపై చర్చిస్తారు. రాజధాని డిజైన్లను  2, 3 రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్న నేపథ్యంలో ముందుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో రాజమౌళి భేటీ అవుతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతారు.  రేపు  ఫైనల్ డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. రాజధాని భవనాల డిజైన్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 

Don't Miss