రేపు సీఎం చంద్రబాబు, సీఆర్డీఏ అధికారులతో దర్శకుడు రాజమౌళి భేటీ

15:34 - December 11, 2017

గుంటూరు : రాజధాని భవనాల డిజైన్లపై ఏపీ సర్కార్ ప్రజాభిప్రాయం సేకరించనుంది. పబ్లిక్ డొమైన్ లో పెట్టి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోనుంది. రేపు సీఎం చంద్రబాబు, సీఆర్డీఏ అధికారులతో దర్శకుడు రాజమౌళి భేటీ కానున్నారు. రాజధాని శాశ్వత భవనాల డిజైన్లను ప్రభుత్వం 2,3 రోజుల్లో ఖరారు చేయనుంది. ఎల్లుండి ఫైనల్ డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ముందుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో రాజమౌళి భేటీ కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss