తన 'రీ ఎంట్రీ' ఇలా వుండాలంటున్న 'డిస్కో'శాంతి..

16:30 - April 16, 2018

డిస్కో శాంతి 1980వ దశకపు ప్రముఖ తెలుగు నృత్యతార. ఈమె తెలుగు సినీరంగంలో రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న శ్రీహరిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్న అనంతరం సినిమాలకు దూరంగా వుంది. శ్రీహరి మరణంతో ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. ఒక దశలో శ్రీహరి చనిపోలేదనీ..ఫామ్ హౌస్ లోనే వున్నాడనీ రోజు ఆహారం తీసుకెళ్లి పెట్టి అక్కడ ఎక్కువ సమయం గడిపేస్థాయికి ఆమె వెళ్లిపోయింది. కానీ కాలం అన్ని గాయాలను..ఎటువంటి గాయాలనైనా మాన్పేగుణం కాలానికి వుంది. అలా కాలం చేసిన గాయాన్ని ఆ కాలానుగుణంగా కోలుకున్ డిస్కోశాంతి ఇప్పుడిప్పుడే శ్రీహరి చనిపోయిన గాయం నుండి కోలుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ చానల్ కుమాట్లాడుతు తన 'రీ ఎంట్రీ'కి సంబంధించిన ప్రస్తావనను బైటపెట్టారు. తెలుగు తెరపై మళ్లీ నన్ను చూసే అవకాశాలు వున్నాయి. గుంపులో గోవింద అనిపించే పాత్రలు మాత్రం చేయను .. అంత అవసరం లేదు కూడా. ప్రాధాన్యత కలిగిన మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా వున్నాను. పిల్లలు పెద్దవాళ్లయ్యారు .. అందువలన ఇప్పుడు చేయవచ్చని అనుకుంటున్నాను. మళ్లీ నటన వైపుకు వెళ్లడం వలన నలుగురిని కలవడం .. మాట్లాడటం జరుగుతుంది. మనసుకి కాస్త ఊరట కలుగుతుందనే ఉద్దేశంతోనే అటుగా ఆలోచిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.   

Don't Miss