నాగరికంలో అనాగరికం...

07:35 - January 20, 2018

ప్రకాశం/నెల్లూరు : ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కంచరగుంట గ్రామ పంచాయితీలో అగ్రవర్ణాలు దళితులను గ్రామంలోకి అడుగుపెట్టనివ్వడంలేదు.గ్రామంలో బొడ్డురాయిని ఏర్పాటు చేసినందుకు తమను గ్రామంలోకి అనుమతించడంలేదని దళితులంటున్నారు. స్కూలుకు కూడా వెళ్లకనీయకుండా పిల్లలను అగ్రవర్ణాల వాళ్లు అడ్డుకుంటున్నారని చెప్పారు. అటు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తీపనూరులో కుల వివక్ష రాజుకుంది. దళితులపై అగ్రవర్ణాల ఆధిపత్యం చెలాయిస్తుండటంతో దళితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తీపనూరులో 25 దళిత కుటుంబాలు, 150 అగ్ర వర్ణాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే దళితులను ఆలయంలోకి రానివ్వకుండా అగ్రకులస్తులు అడ్డుపడ్డారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దళితులపై దాడి చేశారు. దీంతో దళితులు ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈనెల 30న ఆలయ ప్రవేశం కల్పిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చినట్లు సమాచారం. 

Don't Miss