ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

21:46 - March 13, 2018

ఆధార్ పరిధిలోకి రావాలన్న ప్రభుత్వ హుంకారానికి సుప్రీంకోర్టు కళ్లెంవేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మనదేశంలో ఒక బిగ్ బ్రదర్ ను కనిపెట్టారు.. నిరంతర నిఘాకు మార్గం వేశారు.. దానిని నిర్బంధం చేశారు..పిడికెడు బియ్యంతో కడుపునింపుకునే పేద బ్రతుకుకు ఆధార్, రైతు ఎరువుకు ఆధార్, కళ్లు కాయలుకాసే ముసలి అవ్వ పిన్షన్ కు ఆధార్, సమస్త సంక్షేమ పథకాల అమలుకు ఆధార్, సరేసరి ఒప్పుకుందాం.. దుర్వినియోగం అరికట్టడానికే అని ప్రభుత్వం చెబుతున్న సాకులు సహేతుకమైనవే అని అనుకుందాం.. కానీ బ్యాంకు ఖాతాకు ఆధార్, మొబైల్ సిమ్ కు ఆధార్, 
డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్, ప్రావిడెండ్ ఫండ్ కు ఆధార్, ప్రత్యామ్నాయ వ్యవస్థలున్న చోట కూడా ప్రతి పనికి ఆధార్..దీనికి ఎలా చూడాలి? పౌర స్వేచ్ఛపై ప్రభుత్వ నిఘా, నియంత్రణ, పెత్తనం... ఎటు దారితీస్తుంది ? సమాధానం వెతకాల్సిందే.. ఇది న్యాయ సమ్మతమేనా..? సొంత పౌరులపై ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనను రాజ్యాంగం అనుమతిస్తుందా.?  ఈ సందేహమే సుప్రీంకోర్టు గడపతొక్కించింది. మార్చి 31 తో సమస్త పౌర సమాచారం ఆధార్ పరిధిలోకి రావాలన్న ప్రభుత్వ హుంకారానికి సుప్రీంకోర్టు కళ్లెంవేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆర్థిక నిపుణులు శశికుమార్ పాల్గొని, మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss