మార్పు సాధ్యమేనని మేం నిరూపించాం..

15:00 - June 12, 2018

సింగపూర్ : మార్పు సాధ్యమేనని మేం ఇద్దరం నిరూపించాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇదొక చారిత్రాత్మక సమావేశమని..దీనికి కిమ్ , నేను ఓ చారిత్రాత్మక ఒప్పందానికి తెరలేపామన్నారు. సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారన్నారు. త్వరలోనే అణునిరాయుధీకరణ జరుగుతుందని ట్రంప్ తెలిపారు. క్షిపణి ప్రయోగ కేంద్రాలనీన ధ్వంసం చేస్తామని కిమ్ హామీ ఇచ్చారన్నారు. ఉత్తర కొరియా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ఈ సందర్భంగా ట్రంప్ అకాంక్షించారు. యుద్ధం ఎవరైనా చేయవచ్చు..కానీ సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ దిశగా ఆలోచిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్, కిమ్ ఒప్పందాలు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ రోజు సింగపూర్ లో సమావేశం అనంతరం చేసుకున్న సమగ్ర ఒప్పందాలు చేసుకున్నారు. మొదటిది రెండు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, శాంతి, సౌభాగ్యం కోసం నూతన అమెరికా-ఉత్తరకొరియా సంబంధాల ఏర్పాటుకు ఇరు దేశాలు కృషి చేయడం, కొరియా ద్వీపకల్పంలో సుస్ధిర శాతం కోసం రెండు దేశాలు తమ ప్రయత్నాలను ప్రారంభించడం, 2018 ఏప్రిల్ 27నాటి పన్ ముంజోన్ డిక్లరేషన్ ప్రకారం ఉత్తరకొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ కోసం కట్టుబడి ఉండడం, వియత్నాం యుద్ద ఖైదీలను గుర్తించి స్వదేశాలకు పంపేందుకు చర్యలు తీసుకోవడం వంటి పలు కీలక ఒప్పందాలకు ఇద్దరు సమ్మతించినట్లుగా సమాచారం.

Don't Miss