'జగన్‌ ప్రతిపక్ష నాయకుడుగా ఉండటం మా అదృష్టం' : డిప్యూటీ సీఎం కేఈ

15:40 - October 13, 2017

తూర్పుగోదావరి : జగన్‌ ప్రతిపక్ష నాయుకుడిగా ఉండటం మా అదృష్టమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జగన్‌ తలకిందులుగా తపస్సుచేసినా జగన్‌ను ప్రజలను నమ్మరని చెప్పారు. జగన్‌.. తన వికృత ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. నవ్యాంధ్ర అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. 

 

Don't Miss