ఇక చిన్నా వంతు...

09:32 - July 25, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసును చేధించేందుకు సిట్ శాయశక్తులా పనిచేస్తోంది. వివిధ రంగాకు చెందిన వారిని వరుసగా విచారణలు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ పట్టుబడడంతో సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. అతని విచారణలో టాలీవుడ్ సెలబ్రెటీలు..కాలేజీ..స్కూళ్లు విద్యార్థులున్నట్లు తెలియడంతో కలకలం రేగింది. దీనితో ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా టాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖ హీరోలు..హీరోయిన్స్ కు నోటీసులు జారీ చేశారు. దీనితో ఆయా హీరోలు విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కు సంబంధించిన విషయాలను రాబట్టేందుకు వారిని విచారించారు. పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, నవదీప్ లను ఇప్పటి వరకు విచారించారు.

ఆర్ట్ డైరెక్టర్ చిన్నా..
మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 10.30గంటలకు విచారణ జరగనుంది. గంటల పాటు జరిగే ఈ విచారణలో సిట్ పలు ప్రశ్నలు సంధించనుంది. కెల్విన్ తో సంబంధాలు..డ్రగ్స్ తదితర విషయాలపై చిన్నా ఎలాంటి సమాధానం చెప్పానున్నారో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే సినీ నటి ఛార్మీ విచారణకు ముందే హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. బలవంతంగా తన నుండి రక్తనమూనాలు తీసుకోకూడదంటూ సిట్ ను ఆదేశించాలని ఛార్మీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమా పరిశ్రమలో ఓ వర్గం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని..కావాలని కుట్రపూరితంగా డ్రగ్స్ కేసు బనాయించారని పేర్కొంది. సిట్ కు చట్టబద్ధత లేదని..కేసులు నిలబడవన్న వాదనలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఖండించారు. డ్రగ్స్ కేసులో 7 కేసులు నమోదు చేసి 27 మందిని ప్రశ్నించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మంగళవారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Don't Miss