ఎంపీ సాక్షి మహరాజ్‌ కు ఈసీ నోటీసులు

13:24 - January 10, 2017

ఢిల్లీ : ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ ఇబ్బందుల్లో పడ్డారు. దేశంలో జనాభా పెరుగుదలుకు ముస్లింలే కారణమంటూ సాక్షి మహారాజ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ముస్లింకు నలుగురు భార్యలు, నలభై మంది పిల్లలు.. అన్న సాక్షి మహరాజ్‌ చేసిన విమర్శలపై తీవ్ర దుమారం చెలరేగింది. దేశంలో  హిందూ జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో సాక్షి మహరాజ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయంటూ కొంతమంది కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్‌.... వివాదాస్పద వ్యాఖ్యలపై ఈనెల 11 లోగా  వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సాక్షి మహరాజ్‌కు నోటీసులు జారీ చేసింది.

 

Don't Miss