పోలీసులపై లగడపాటి వాగ్వాదం..అర్థరాత్రి ఉద్రిక్తత..

07:39 - November 9, 2018

హైదరాబాద్ : మాజీ ఎంపీ లగడపాటి ఫైర్ బ్రాండ్ గా పేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ర్పే తో పెను సంచలనం సృష్టించిన తరువాత రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా రాజకీయాలకు దూరంగా వున్నారు. అప్పటి నుండి తిరిగి గత కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పోటీ చేస్తానంటు మరోసారి వార్తల్లోకి వచ్చిన లగడపాటి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలో సోదాలకు వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సోదాలు ఏంటంటూ పోలీసులపై లగడపాటి మండిపడ్డారు. ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. భూమి విషయంలో తన మిత్రుడైన జీపీ రెడ్డిని బెదిరింపులకు గురిచేస్తున్నారని, అర్ధరాత్రి ఈ సోదాలేంటని ప్రశ్నించారు. 
 

Don't Miss