భూకంపంతో 130 మంది మృతి..

08:31 - November 13, 2017

ఇరాన్ : భూకంపంతో ఇరాక్- ఇరాన్ సరిహద్దులు కదిలిపోయాయి. ఇరాన్ - ఇరాక్ సరిహద్దులో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. ఈ భూకంపంతో భారీ స్థాయిలో ఆస్తి..ప్రాణ నష్టం సంభివించింది. చాలా గ్రామాలకు రవాణా పూర్తిగా స్థంభించింది. పాక్..లెబనాన్..టర్కీ దేశాల్లో కూడా భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా 130 మంది మృతి చెందగా 200 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హలబ్జా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు నివాసాల నుండి బయటకు పరుగులు తీసి రోడ్లపైనే పడిగాపులు పడుతున్నారు. కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో భూంకంపాలు ఎక్కువగా సంభవిస్తుంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Don't Miss