ఓవర్సీస్ లో 'చిన్నవాడా' హావా..

12:08 - November 28, 2016

టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నిఖిల్' కూడా ఒకరు. వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఈ హీరో. 'శంకరాభరణం' డిజాస్టర్ తరువాత 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' అనే చిత్రంలో 'నిఖిల్ నటించాడు. టైగర్ ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇటీవలే విడుదలైంది. పెద్ద నోట్లు రద్దు ఎఫెక్ట్ తో పలు చిత్రాలు వెనుకంజ వేశాయి. కానీ 'నిఖిల్' చిత్రం మాత్రం విడుదలైంది. పోటీ కూడా లేకపోవడంతో ఈ చిన్న సినిమాకు కలెక్షన్ల పంట పండుతోందంట. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూలు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు దూసుకపోతోందని టాక్ వినిపిస్తోంది. శుక్రవారం 95వేల డాలర్లు సాధించిందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే 'నిఖిల్' కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవనుంది. ఈ వారాంతానికి హాఫ్ మిలియన్ మార్క్ రీచ్ అవ్వటం ఖాయమని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారంట.  

Don't Miss