మోడీ సర్కార్ కు రెఫరెండం ?

20:33 - January 16, 2017

మినీ సంగ్రామం మోడీ సర్కారుకు రెఫరెండం కానుందా? 2019ఎన్నికలకు ఇది శాంపిల్ తీర్పు కాబోతోందా? డీమానిటైజేషన్ సెగలను ఈవీఎంల ద్వారా ప్రకటించబోతున్నారా? యూపీ పరిణామాలు ఎలా సాగుతున్నాయి? పంజాబ్ ఓటర్లు ఎటు మొగ్గుచూపుతున్నారు? ఉత్తరాఖండ, గోవా, మణిపూర్ లలో ఏం జరుగుతోంది? ఈ అంశంపై ప్రత్యేక కథనం..మినీ సంగ్రామానికి సై అంటున్నారు. దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎన్నికలకు రాజకీయ పక్షాలు సన్నధ్దమైతున్నాయి . ఎత్తులు పై ఎత్తులు, పొత్తులు వ్యూహాలతో రాజకీయ పక్షాలు ముందుకు కదులుతున్నాయి. మరో రెండు నెలల పాటు దేశమంతటా రాజకీయాలు మాంచి రసవత్తరంగా సాగనున్నాయి. అయిదు రాష్ట్రాలు .. 690 అసెంబ్లీ స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. లక్షా 85వేల పోలింగ్ స్టేషన్లు.. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళితో, వివిధ పార్టీల మధ్య మారుతున్న సమీకరణాలతో రాజకీయాలు వేడెక్కాయి.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.. మినీ ఇండియాగా పేరు. ఇక్కడ గెలిస్తే దేశ రాజకీయాలపై పట్టు సాధించవచ్చనే ఆలోచన . అన్ని పార్టీల కన్నూ ఈ రాష్ట్రం పైనే. తక్కువ ఓట్ల శాతంతోనే రాజకీయ పక్షాల తలరాతలు మారుతూ ఉంటాయి. మరి ఈ రాష్ట్రంలో వివిధ పార్టీల ఎత్తులు ఎలా ఉన్నాయి. డీమానిటైజేషన్ ...దేశాన్ని రెండునెలలుపైగా ఇబ్బంది పెట్టింది. ఇప్పటికీ ఏటీఎం కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపబోతోందా? కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు ఎన్నికల తీర్పులో ఈ అంశాన్ని కీలకం చేయబోతున్నారా? బడ్జెట్ ని ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాలని సర్కారు భావిస్తోందా?

పొలిటికల్ గా మంచి దూకుడు..
పంజాబ్ పరిణామాలేం చెప్తున్నాయి? మణిపూర్ లో ఏం జరుగుతోంది? ఉత్తరాఖండ్, గోవా రాజకీయాలు ఏ దిశగా మళ్లుతున్నాయి. మినీ సంగ్రామం ఏం తేల్చనుంది? జతకట్టేదెవరు? ఒంటరిగా బరిలో దిగేదెవరు? మినీ సంగ్రామం.... దేశ రాజకీయాలపై స్పష్టమైన అవగాహనను ఇవ్వబోతున్న ఎన్నికలు. మూడేళ్ల మోడీ సర్కారు పాలనపై, డీమానిటైజేషన్ సెగలపై ఇవ్వబోతున్న రెఫరెండం.. మరో పక్క దేశం లోనే పెద్ద రాష్ట్రం యూపీ, కీలకంగా మారిన పంజాబ్ ఇలా ఓవరాల్ గా రాబోయే రెండు నెలలు పొలిటికల్ గా మంచి దూకుడు కనిపించబోతోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss