రెండవ స్కార్పిన్ క్లాస్ సబ్‌మెరైన్ ఖందేరీ జలప్రవేశం...

15:37 - January 12, 2017

ముంబై : ఫ్రెంచ్ డిజైన్‌తో రూపొందించిన రెండవ స్కార్పిన్ క్లాస్ సబ్‌మెరైన్ ఖందేరీ- ముంబైలోని మజగాన్ డాక్స్‌ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ భామ్రే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రి భార్య బీనా భమ్రే ఈ సబ్‌మెరైన్‌ను ప్రారంభించారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్ సునీల్‌ లాంబా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ సహకారంతో 3 బిలియన్ల ఖర్చుతో మజగాన్‌ డాక్స్‌ 6 సబ్‌మెరైన్లను నిర్మిస్తోంది. కల్వరి మొదటి సబ్‌మెరైన్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. మిగతా 4 సబ్‌మెరెన్లను ప్రారంభించడానికి మరో 9 నెలలు పట్టే అవకాశముంది. ఖందేరి సబ్‌మెరైన్‌కు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఐఎన్‌ఎస్ ఖందేరీగా భారత నేవీకి అప్పగించనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ సబ్‌మెరైన్‌ను రూపొందించారు. యుద్ధక్షేత్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడే శక్తి దీనికుంది.

Don't Miss