విశాఖ రైల్వే జోన్‌ సాధించేవరకు పోరాటం : ఎంపీ తోట నరసింహం

13:06 - August 7, 2018

ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్‌ సాధించేవరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, శాసన సభ, మండలిసభ్యులు, మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ కోరుతూ ఇవాళ కేంద్ర రైల్వే మంత్రి పియూశ్‌ గోయల్‌ను కలవనున్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 350 కోట్లు త్వరగా విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని కోరనున్నారు. 

 

Don't Miss