కాంగ్రెస్‌, బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు : పి.మధు

19:55 - February 5, 2018

నల్గొండ : బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఈమేరకు మధుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అయ్యిందన్నారు. ఈ ప్రయత్నాలు ఏపీలో జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై ఈనెల 10 నుంచి భీమవరంలో జరిగే రాష్ట్ర సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. 

 

Don't Miss