శ్రీకాకుళం వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం : పవన్

17:02 - May 29, 2018

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వెనుకబడినది కాదు వెనక్కి నెట్టివేయబడిన ప్రాంతం అని పోరాటాల పురిటిగడ్డ శ్రీకాకులం జిల్లా నుండే తన పోరాటయాత్రను చేపట్టాననన్నారు. వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా నుండి ప్రజలే వలసలు వెళుతున్నారు తప్ప నాయకులు మాత్రం కాదన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది ఎన్నికలకు మూడు నెలల ముందు వెళ్లడిస్తామన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించామని చెబుతున్న చంద్రబాబు...వారి కుటుంబసభ్యులనే కమిటీగా వేసి పంపితే ఉద్దానం వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. వామపక్షాలతో ఉన్న బలమైన బంధాన్ని కొనసాగిస్తామంటున్న పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు : పవన్
ఇసుక దందాల మీద వున్న శ్రద్ధ ప్రజాసమస్యలపై నాయకులకు లేదనీ..నాయకులు పాతుకుపోయి వున్నారు తప్ప పాతుకుపోయిన ప్రజాసమస్యలపై మాత్రం పాలకులకు చిత్రశుద్ధి లేదన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పనులతో వేలాది ఎకరాలకు సాగునీటి అందించవచ్చని ఈ రిజర్వాయర్ పై శ్రద్ధలేదన్నారు. పుష్కరాల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారనీ..సాగునీటి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేయబడినందువల్లనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చిందనీ..ఇదే ఉత్తరాంధ్రలో తలెత్తే అవకాశాలను నిర్లక్ష్యంతో కల్పించవద్దని..అటువంటి పరిస్థితులతో మరోసారి తెలుగు రాష్ట్రంలో విభేదాలు తలెత్తకూడదనీ..అందుకే అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలని జనసేనా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Don't Miss