ప్రొ.నాగేశ్వర్ తో ఫేస్ టు ఫేస్...

21:24 - December 16, 2017

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ పాత్ర, జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అనే అంశాలపై ప్రొ.నాగేశ్వర్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. 
రాజకీయాల్లో సంక్షోభం సహజం
'ప్రజాస్వామ్య రాజరికం కాంగ్రెస్ కే పరిమితం కాదు. భారత రాజకీయాల్లోనే ప్రజాస్వామిక రాజరికం ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం కొత్తకాదు. రాజకీయాల్లో సంక్షోభం సహజం. ప్రజా అనుకూల విధానాలతోనే నాయకులకు మంచి పేరు వస్తుంది. నాయకులు చరిత్రను సృష్టించలేరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది. తెలంగాణ ఉద్యమం లేకుంటే కేసీఆర్, కేటీఆర్ ఈ స్థాయిలో ఉండేవారు కాదు. ఓటములను నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. 
సరైన విధానాలు అనుసరిస్తే ఉపయోగం
బీజేపీ అనుసరించే విధానాలకు ప్రత్యామ్నాయంగా ఏ విధానాలు అవలంభిస్తారనే అంశంపై పైనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఆధారపడుతుంది. మోడీ గొప్పనాయకుడు కాదు.. రాహుల్ చేతగాని నాయకుడు కాడు. పార్టీ ఓడిపోయే దశ వస్తే ఎలాంటి నాయకుడైన వేస్ట్.. పార్టీ గెలిచి దశ వస్తే ఎలాంటి నాయకుడైన గెలుస్తాడు. సందర్భాన్ని బట్టి నాయకులు తయారు అవుతారు. విధానాలు నిర్ణయించేది వయస్సు కాదు. విధానాలు అనుసరించే అంశమే ముఖ్యం. వయసు ఆధారిత సిద్ధాంతాన్ని నేను అంగీకరించను. సరైన విధానాలు అనుసరిస్తే ఉపయోగం. రాజకీయాల్లో చాలా మంది అసమర్థలు ఉన్నారు. 
ప్రజా ఉద్యమాలతోనే రాహుల్ కు ఇమేజ్
బలమైన ప్రజా ఉద్యమాలకు రాహుల్ నాయకత్వం వహిస్తేనే నాయకుడు అవుతాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి రాహుల్ కు మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటాలు చేయాలి.. అందుకు పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. బీజేపీ హిందూ పార్టీగానే ఉంది. ప్యాన్ ఇండియాగా ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో ఉన్న ఒక నాయకుని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss