కొత్త ఫ్రంట్ వచ్చేసింది...

19:43 - January 11, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త రాజకీయ ఫ్రంట్‌ ఆవిర్భవించనుంది. ఈ నెల 25న 'బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌' పేరుతో ఆవిర్భావ సభ జరగనుంది. సామాజిక న్యాయ సాధనకు.. రాజ్యాధికార లక్ష్యంగా ఈ ఫ్రంట్‌ పని చేస్తుంది. ఫ్రంట్‌ నూతన అధ్యక్షుడిగా నల్లా సూర్యప్రకష్‌.. కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. తెలంగాణ వచ్చినా ప్రజల బతుకుల్లో మార్పులేదని... ప్రత్యామ్నాయ విధానంతో ప్రజల్లోకి వెళ్తామని తమ్మినేని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నా...అన్నీ ఒక తాను గుడ్డలోనని తెలిపారు. కార్పొరేట్..ధనికులకు..భూ స్వాములకు అనుగుణంగా ఆ పార్టీలున్నాయని..ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేని వారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు.

తెలంగాణ మరింత వెనుకబడి ఉందని, ప్రజలకు అనుగుణంగా పరిపాలించే పార్టీ రాలేదన్నారు. ఈ సమయంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడిందని..ఇది సరైన సమయంలో ఉద్బవించబోతోందన్నారు. గతంలో అనేక సంవత్సరాల పాటు ప్రధాన శత్రువు పేరిట పార్టీలను ఓడించడానికి..ఇతరత్రా ప్రయత్నాలు జరిగాయని, దీర్ఘకాలికంగా చూస్తే ఎలాంటి ఫలితం రాలేదన్నారు. మిగతా పార్టీలకు..వామపక్ష పార్టీలకు తేడా ఏంటో ప్రజలకు చూపెట్టాలని..ఇలా చేయడం వల్ల ఒక మహాశక్తిగా రూపొందే అవకాశం ఉందన్నారు. 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పోటీ చేస్తుందని తమ్మినేని వెల్లడించారు. 

Don't Miss