కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత : తమ్మినేని

12:04 - March 19, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర రథసారథి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయనతో 10 టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పాదయాత్ర లక్ష్యం నెరవేరిందని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పాదయాత్రతో సమాజిక ఎజెండాపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. అనేక ఉద్యమాలు జరిపితే తప్ప సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. పాదయాత్ర ఎజెండా చుట్టూ ప్రభుత్వాన్ని తిప్పగలింది. అయితే సీఎం మాట్లాడినంత మాత్రాన అమలు జరుగుతాయన్న నమ్మకం లేదని తెలిపారు. కేసీఆర్ మాట్లాడిన ఏ ఒక్క మాట నిజం కాలేదని ఎద్దేవా చేశారు. కలిసి వచ్చే సంఘాలతో భవిష్యత్ లో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజల ఒత్తడి, ఉద్యమాలే శరణ్యమన్నారు. పదవి ఉన్న లేకున్నా.. ప్రజల తరపున పోరాడేది ఎర్రజెండాయే అని స్పష్టం చేశారు. తమ పార్టీపై ప్రజలు భరోసా ఉంచారని తెలిపారు. తన ఆర్యోగంపై తనకు సంపూర్ణమైన ధీమా ఉందన్నారు. రాళ్లకు బదులు... పాదయాత్రపై పూల వర్షం కురిసిందని, ఆపూర్వ స్వాగతం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలపై సీఎం కేసీఆర్ కు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. 

 

Don't Miss