డబ్బును అందుబాటులోకి తేవడంలో ఆర్ బీఐ, కేంద్రం విఫలం : జీవన్ రెడ్డి

16:14 - January 7, 2017

జగిత్యాల : పెద్ద నోట్లు రద్దు చేసిన 60 రోజులు పూర్తైనా బ్యాంకుల్లో డబ్బు అందుబాటులో లేక రైతులు అల్లాడుతున్నారు. రబీ సీజన్‌లో వ్యవసాయ పనులకు నదగు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు జగిత్యాలలో బ్యాంకుల మందు ఆందోళనకు దిగారు. రైతుల నిరసనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు పలికారు. రైతులకు అవసరమైన డబ్బును అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ఆర్ బీఐ, కేంద్ర ప్రభుత్వంపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు లేక ఇబ్బందులు రైతులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నగదు అందుబాటులో ఉంచాలని కోరారు.

Don't Miss