రైతులు ఆగ్రహిస్తే గిట్ట ఉంటది...

12:42 - January 22, 2018

పెద్దపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతన్నలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తమ ఆగ్రహం ఎలా ఉంటుందో ఆ ప్రజాప్రతినిధులకు చూపెట్టారు. రైతులు చేసిన ఆందోళనతో ప్రజాప్రతినిధులు కార్లు దిగి పోలీసుల సహాయంతో వెళ్లాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా పెద్దపల్లి జిల్లాలో ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను చేపట్టారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీకి చెందిన గోదాంలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వారు ప్రయాణిస్తున్న వాహనాలకు అడ్డు తగిలారు. తమ పంటలు ఎండిపోతున్నాయని..సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారు ? అని రైతులు నిలదీశారు. రైతుల ఆగ్రహం చూసిన ప్రజాప్రతినిధులు కార్లు దిగి పోలీసుల సహయంతో వెనుదిరిగారు. 

Don't Miss