లారీలు అడ్డుకున్న రైతులు

19:23 - September 10, 2017

పశ్చిమగోదావరి : జిల్లా మొగల్తూరు మండలం సేరేపాలెంలో ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు చెందిన మట్టి లారీలను రైతులు అడ్డుకుని ధర్నా నిర్వహించారు. వ్యర్ధాలను నేరుగా సముద్రంలోకి పంపేందుకు పైప్‌లైన్‌ వేస్తామని చెప్పిన కంపెనీ యాజమాన్యం... పైపులైన్లు వేయకుండానే నిర్మాణం చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్ధాలతో తమ పంటలు నాశనమవుతాయని... కంపెనీకి వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయాన్ని సబ్‌కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. 

Don't Miss