ట్రంప్‌కు మళ్లీ ఎదురు దెబ్బ

21:58 - March 16, 2017

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఆరు ముస్లిం దేశాల వలసదారులపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాలపై హవాయి కోర్టులో చుక్కెదురైంది. మరికొద్ది గంటల్లో అమలు కావలసిన ట్రావెల్ బ్యాన్‌పై హ‌వాయి కోర్టు స్టే విధించింది. విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించినట్లయితే అది 'వైద్యం చేయలేని గాయం'గా మిగిలిపోతుందని హవాయి ఫెడరల్‌ న్యాయమూర్తి డెర్రిక్ వాట్సన్  పేర్కొన్నారు. ట్రావెల్‌ బ్యాన్‌ అమలు చేయడానికి అంగీకరించమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.  ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆరు ముస్లిం దేశాల వ‌ల‌స‌దారుల‌పై 90 రోజులు, శ‌ర‌ణార్థుల‌పై 120 రోజుల‌ నిషేధం ఉంది. 

 

Don't Miss