వంశధార నదీ జలాల వివాదంపై వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు

19:41 - September 13, 2017

ఢిల్లీ : వంశధార నదీ జలాల వివాదంపై వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు వెల్లడించింది. నేరడి బ్యారేజీ, సైడ్ వీర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సి.డబ్ల్యు.సి ఛీఫ్ ఇంజనీర్‌ నేత్రృత్వంలో ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు చెందిన ఛీఫ్ ఇంజనీర్లు, సి.డబ్ల్యు.సి డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఒప్పందంలో భాగంగా ఏడాదిలోగా నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం 106 ఎకరాలు సేకరించి ఒడిషా ప్రభుత్వం... ఏపీకి ఇవ్వాల్సి ఉంటుంది. నేరడి బ్యారేజీ ఎడమ కాలువ ద్వారా  5 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనుకుంటే.. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే ఖర్చును కొంత మేర కూడా భరించాల్సి ఉంటుంది. సైడ్ వీర్ నిర్మాణాల ద్వారా వంశధార నదీ జలాలను పెద్ద మొత్తంలో ఏపీ వినియోగించుకొనే అవకాశం ఉందన్న ఒడిషా వాదనలను ట్రిబ్యునల్ కొట్టివేసింది. 

Don't Miss