శృంగవరంలో ఫైర్ ఆక్సిడెంట్...

10:09 - February 13, 2018

విశాఖపట్టణం : నాతవరం మండలం శృంగవరంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం యూనిట్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. క్షణాల్లో మంటలు చుట్టూ వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడం..పొగ దట్టంగా అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా మిషనరీ కాలిపోవడంతో భారీగానే ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు పనిచేస్తున్నారా ? వారు ఎంత మంది ఉన్నారనే తెలియరావడం లేదు. 

Don't Miss