పారిస్‌లో కాల్పుల కలకలం

21:57 - March 18, 2017

ఫ్రాన్స్ : పారిస్‌లోని ఓర్లీ ఎయిర్‌పోర్టులో ఉదయం ఎనిమిదిన్నరకు కాల్పులు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలోని అధికారి వద్ద నుంచి ఓ వ్యక్తి ఆయుధాన్ని లాక్కునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన భద్రతాదళాలు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అగంతకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల్లో హతమైన వ్యక్తి పేలుడు పదార్థాలు కలిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భద్రాతా దళాలు పేలుడు పదార్థాల కోసం తనిఖీలు చేశారు. కాల్పుల శబ్దంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం 3 వేలమంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టు నుంచి అధికారులు ఖాళీ చేయించారు. కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియలేదు.

 

Don't Miss