పరిణీతికి అరుదైన గౌరవం...

11:19 - September 7, 2017

బాలీవుడ్ నటి 'పరిణీతి చోప్రా'కు అరుదైన గౌరవం దక్కింది. బాలీవుడ్ లో అందాల భామగా పేరొందిన ఈ నటి ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. చాలా బ్రాండ్లకు..ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియా టూరిజం రాయబారిగా నియమితులయ్యారు. ఆస్ట్రేలియా పర్యటక శాఖ రాయబారిగా వ్యవహరించనున్న తొలి భారతీయ మహిళ కూడా పరిణీతే. ఫ్రెండ్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా (ఎఫ్‌ఓఏ) అడ్వొకసీ ప్యానెల్‌లో పరిణీతితో పాటు ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ఉన్నారు. ఈసందర్భంగా 'పరిణీతి' మీడియాతో మాట్లాడారు. ' ఫ్రెండ్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియా ఇష్టమైన పర్యాటక దేశాల్లో ఒకటి. గత ఏడాదే నేను ఆ దేశం వెళ్లాను. ఒక ట్రిప్పు అయితే చాలదు'' అని పేర్కొంది. పర్యటక శాఖ అంబాసిడర్‌గా పరిణీతి క్వీన్స్‌ల్యాండ్‌తో పాటు వివిధ ప్రసిద్ధ ప్రాంతాల్లో పర్యటించనుంది. 

Don't Miss