30 మంది విద్యార్థులు అస్వస్థత..

20:56 - January 9, 2017

రాజన్న సిరిసిల్ల : వీర్నపల్లి ఆదర్శ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిలో కొంతమందిని వీర్నపల్లి ఆసుపత్రికి, కొంతమందిని ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ జరిపిన డీఈవో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్లారెడ్డి ఆసుపత్రికి చేరుకున్న డీఈవో విద్యార్థులను పరామర్శించారు.

Don't Miss