కాంగ్రెస్ లోకి 'నల్లారి'...!

18:34 - July 12, 2018

విజయవాడ : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ తో పాటు పలువురు నేతలు శుక్రవారం పార్టీ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా అందులో సక్సెస్ కాకపోవడంతో కిరణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండడంతో పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేసేందుకు రాహుల్ వ్యూహాలు పన్నుతున్నారు.

గతంలో విభజనను వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్న కీలక నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు పలువురు దూతలను ఏపీకి రాహుల్ పంపించిన సంగతి తెలిసిందే. పార్టీకి దూరంగా ఉన్న నేతలతో దూతలు చర్చలు మొదలు పెట్టారు. అందులో భాగంగా కిరణ్ తో చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఆయన పార్టీలో చేరేందుకు సమ్మతించినట్లు, ఏఐసీసీ కార్యదర్శి..., సీడబ్ల్యూసీ వంటి కీలక పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయతో పాటు ఇతర కీలక నేతలను పార్టీలోకి రావాలని పిలుపునిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి పాత నేతలను తిరిగి పార్టీలోకి అధిష్టానం ఆహ్వానిస్తోంది.

Don't Miss