పాక్ కు త్వరలో అమెరికా షాక్...

21:24 - December 30, 2017

ఢిల్లీ : అమెరికా త్వరలోనే పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌ ఇవ్వనుంది. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇచ్చే 25 కోట్ల 50 లక్షల డాలర్ల సహాయాన్ని నిలిపివేసే దిశగా చర్చలు జరుపుతోంది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ అనుసరిస్తున్న విధానంపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఆ దేశానికిచ్చే సహాయాన్ని నిలిపి వేయాలని సూచించినట్లు సమాచారం. అరాచకత్వం, హింస, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేసే వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలన్న అమెరికా ఆదేశాలను పాక్‌ పెడచెవిన పెడుతుండడంతో ట్రంప్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాకిస్తాన్‌కు 2002 నుంచి సహాయం చేస్తున్న అమెరికా ఇప్పటివరకు 33 బిలియన్‌ డాలర్లను అందజేసింది.

Don't Miss