కీసరకు రూ. 75 కోట్లు వచ్చాయా ?

10:39 - February 13, 2018

హైదరాబాద్ : మహాశివరాత్రి...దేశ..వివిధ రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు ఉదయం నుండే స్వామి దర్శనానికి క్యూ కట్టారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులోని కీసర గుట్ట ఆలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏడు మార్గాలు ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతినిస్తున్నారు. వీఐపీలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. గతంలో సీఎం ప్రకటించిన రూ. 75 కోట్లతో కీసర ఎంతో అభివృద్ధి అవుతుందని తెలిపారు. 

Don't Miss