గ్యాస్ సిలిండర్..వీటిని గమనించారా ?

11:29 - April 27, 2017

గ్యాస్ సిలిండర్..లేనిది వంట అయ్యే పరిస్థితి లేదు. కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల పర్యావరణానికి హాని చేకూరడంతో పాటు..వారి ఆరోగ్యం కూడా దెబ్బతినేది. గ్యాస్ సిలిండర్లు వినియోగంలోకి వచ్చాక ఆ సమస్య తీరింది. తొందరగా వంట కూడా అయ్యే వీలుంది. కానీ గ్యాస్ సిలిండర్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. సిలిండర్‌ తొందరగా ఇంటికొస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు. ఏదీ గమనించకుండా సిలిండర్‌ను ఇంట్లో దించేసుకుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది..ఆ జాగ్రత్తలు మీ కోసం..

  1. సిలిండర్ తీసుకోగానే అది ఎంత బరువు ఉందో గమనించాలి. తక్కువగా ఉంటే బరువెంతో చెక్ చేసి తీసుకోవాలి. ముందుగానే దాని ఎక్స్ పైరీ డేట్ చూసి తీసుకోవాలి.
  2. ఎక్స్ పైరీ డేట్ ఎలా తెలుస్తుంది అంటారా ? సిలిండర్ ను చేతిలో పట్టుకొనే ప్లేస్ లో ఉంటాయి.
  3. ఇంగ్లీషులో ఎ, బి, సి, డి అనే అక్షరాలు లేదా రెండంకెల సంఖ్య ఉంటుంది. ఇవి నెలను సూచిస్తాయి. ఉదాహరణకు ఎ అనే అక్షరం వుంటే జనవరి నుంచి మార్చి వరకు (తొలి త్రైమాసికం) అనే అర్థం.
  4. బి అనే అక్షరం వుంటే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు, సి అంటే జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు, డి అంటే అక్టోబర్‌ నుండి డిసెంబర్‌ వరకు త్రైమాసికాలను గుర్తిస్తుంది.
  5. సిలిండర్లో సి 14 అనే సంఖ్య ఉంటే 2014 సెప్టెంబర్‌ వరకు ఉపయోగించవచ్చునని అర్థం.
  6. ఇక సిలిండర్‌ సీల్‌ను తప్పకుండా చెక్‌ చేయాలి. సిలిండర్‌ సీల్‌ ప్యాక్‌ అయ్యిందా ? లేదా ? నేది చూసుకోవాలి.
  7. సిలెండర్‌ రెగ్యులేటర్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏదైనా సమస్య వుంటే గ్యాస్‌ లీకేజ్‌ అవుతుంది.
  8. గ్యాస్‌ లీకేజ్‌ అయితే వెంటనే సప్లై చేసే వారి వద్దే రెగ్యులేటర్‌ ప్లస్‌ రబ్బర్‌ పైప్‌ను మార్చుకోవడం ఉత్తమం.

Don't Miss