లెక్చరర్సా? గూండాలా?.!!

16:51 - September 8, 2018

నాగర్ కర్నూలు : జిల్లాలోని గీతాంజలి కాలేజ్ ప్రిన్సిపల్ రెచ్చిపోయాడు. మనిషిననే సంగతి మరచిపోయాడు. కనీసం ప్రిన్సిపల్ స్థానంలో వున్న విలువల్ని సైతం మరిచిపోయి పశువులా మారిపోయి విచక్షణ మరచి విద్యార్థిని గొడ్డును బాదినట్లుగా బాదాడు. ఇంటర్ విద్యార్థి ఆదిత్యపై తన ప్రతాపాన్ని చూపిన ప్రిన్సిపల్ సురేంద్ర అతన్ని చితకబాదాడు. దీనికి మరో ముగ్గురు నవీన్, లక్ష్మణాచారి, రమేశ్ అనే లెక్చరర్లు ప్రిన్సిపల్ కు సహకారం అందించారు. దీంతో ఆదిత్య పరిస్థితి విషమించటంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా హాస్టల్ లో వున్న ఇద్దరు విద్యార్ధుల మధ్య తలెత్తిన వివాదాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆదిత్యను పిలిచిన ప్రిన్సిపల్ సురేంద్ర జరిగిన విషయాన్ని విచారించకుండానే ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. ఈ దారుణానికి మరో ముగ్గురు లెక్చరర్లు సహకరించటంతో తీవ్రంగా గాయపడిన ఆదిత్యను చూసిన తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు. 

Don't Miss