పెళ్లి మండపం నుంచి వరుడిని కిడ్నాప్‌ చేసిన యువతి

21:23 - May 17, 2017

యూపీ : పెళ్లి మండపం నుంచి వధువును కిడ్నాప్‌ చేయడం లాంటి ఘటనలు సినిమాల్లోనే కాదు...నిజ జీవితంలోనూ చూస్తూ ఉంటాం. ఇందుకు విరుద్ధంగా ఓ యువతి పెళ్లి మండపం నుంచి వరుడిని కిడ్నాప్‌ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో హల్‌చల్‌ సృష్టించింది. హమీర్‌పూర్‌ జిల్లాలో ఓ ఆసుపత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్న అశోక్‌ అక్కడే పనిచేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. జీవితాంతం కలిసి ఉండాలని వారు ప్రమాణం కూడా చేశారు. ఇంతలోనే అశోక్‌కు భవానీపూర్‌ గ్రామానికి చెందిన అమ్మాయితో పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికురాలు సుమోలో ఇద్దరు వ్యక్తులతో కలిసి పెళ్లి మండపానికి వచ్చింది. ఇతడు తన ప్రేమించాడని...వేరే అమ్మాయితో పెళ్లిజరగనివ్వనని వరుడి తలకు తుపాకి గురిపెట్టి కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయిని కిడ్నాప్‌ చేసిన యువతి ధైర్యానికి మెచ్చుకున్న ఓ పోలీస్ అధికారి ఆమెను ఓ రివాల్వర్‌ రాణిగా పేర్కొన్నారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు తీవ్ర ఆవేదనకు లోనైంది.

Don't Miss