హైదరాబాద్‌ చేరుకున్న పీవీ సింధు

15:59 - August 29, 2017

హైదరాబాద్‌ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలుచుకున్న తెలుగమ్మాయి పీవీ సింధు హైదరాబాద్‌ చేరుకున్నారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రదర్శన ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇదంతా కోచ్‌ గోపీచంద్‌, తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైందని చెప్పారు. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన ఫైనల్‌ ఫోరు చాలా కఠినంగా సాగిందని సింధు పేర్కొన్నారు. హోరాహోరీ జరిగిన పోరులో తృటిలో స్వర్ణాన్ని కోల్పోయినా, ప్రదర్శన పట్ల సింధు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి  లభించిన మద్దతు మరువలేనిదన్నారు. వరల్డ్‌ నంబర్‌ వన్‌  స్థానానికి చేరుకోవడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్‌లో సింధు నాల్గో ర్యాంకులో కొనసాగుతున్నారు. 

 

Don't Miss