పచ్చి కొబ్బరితో మాస్క్ లు..

09:23 - May 22, 2017

సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవాలని పలువురు మహిళలు బ్యూటీషియన్లను ఆశ్రయిస్తుంటారు. పలు మాస్క్ లు వేసుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. పండ్లు..కూరగాయాలతో మాస్క్ లు తయారు చేస్తుండడం తెలిసిందే. పచ్చి కొబ్బరితో కూడా మాస్క్ లు తయారు చేస్తుంటారు. ఈ మాస్క్ ను వేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా..తాజాగా కనిపిస్తుంది.
ఎండకాలంలో వేడిమి నుండి తప్పించుకోవడానికి కొబ్బరి మాస్క్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముఖానికి పది నిమిషాలు పట్టించిన అనంతరం కడుక్కోవాలి.
ఒక కప్పు కొబ్బరి నీళ్లలో ఒక చెంచా కొబ్బరి పాలు, దోసకాయ జ్యూస్, రెండు లేదా మూడు చుక్కల కలబంద రసంతో ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి కాటన్ క్లాత్ తో ముఖానికి పెట్టుకోవాలి. పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.
టమాట గుజ్జులో రెండు చెంచాల కొబ్బరి పాలు..సగం కప్పు కొబ్బరి నూనెను వేసి బాగా కలుపుకోవాలి. ముఖానికి..మెడకు పది నిమిషాలు పట్టించిన అనంతరం చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం కనబడుతుంది. ట్రై చేసి చూడండి.

Don't Miss