వానొచ్చేస్తోంది...

గత రెండు మాసాలుగా ఎండలు..ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కరుబు. త్వరలోనే నైరుతి రుతుపవనాలు వచేస్తాయేని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 15 లోపు దక్షిణ అండమాన్, నికోబార్ దీవులల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించింది. దక్షిణ అండమాన్లో అల్పపీడనం తర్వాత వాయుగుండం ఏర్పడే అవకాశముందని అంచనా. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం మూడు రోజుల ముందే కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సాధారణంగా దక్షిణ అండమాన్ లోకి ఈనెల 20 కల్లా నైరుతి రావాల్సి ఉందని..జూన్ 1న కేరళను తాకాలని నిపుణులు పేర్కొంటున్నారు. నైరుతి రుతు పవనాలు హిందూ మహా సముద్రం నుండి బయలుదేరి మడగాస్కర్ మీదుగా సాగుతాయి. భూ మధ్య రేఖా ప్రాంతాన్ని దాటిన తర్వాత రెండు శాఖలుగా విడిపోతాయి. ఒకటి నైరుతి శాఖ దక్షిణ అండమాన్ మీదుగా బంగాళాఖాతాన్ని, మరోకటి అరేబియా మీదుగా కేరళను తాకుతాయి. తర్వాత ఇవి రెండూ భారతదేశంలో ఏకమవుతాయి.