వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వస్తు, సేవల పన్ను అమలు : జైట్లీ

13:22 - January 11, 2017

గుజరాత్ : వస్తు, సేవల పన్ను విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఈవిషయంలో ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని గాంధీనగర్‌లో జరుగుతున్న ఉజ్వల గుజరాత్‌ సదస్సులో చెప్పారు. జీఎస్ టీకి సంబంధించిన చాలా సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకొస్తామన్నారు. పన్నుల సంస్కరణల్లో ఇది విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుందని అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. 

 

Don't Miss