'ఏపీఎండీసీ బెరైటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

18:59 - January 9, 2017

కడప : ఓబులవారిపల్లె మండలంలోని ఏపీఎండీసీ బెరైటీలో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్‌ డిమాండ్‌ చేశారు. కార్మికులందరికీ ఆసుపత్రి సౌకర్యం కల్పించాలన్నారు. ఏపీఎండీసీలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటీ వెంటనే భర్తీ చేయాలన్నారు. ఏడేళ్లుగా ట్రైనీలుగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. ఏపీఎండీసీ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి హాజరైన గపూర్‌.. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Don't Miss