ఓటు వేసిన ప్రభుత్వ అధికారులు..

11:08 - December 7, 2018

హైదరాబాద్: డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీంట్లో భాగంగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు ప్రభుత్వ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి నగరంలోని ప్రశాసన్‌నగర్‌లో గల సెరికల్చర్ కార్యాలయంలో ఓటుహక్కు వినియోగించుకోగా.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ కుందన్‌బాగ్‌లోని చిన్మయ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నాంపల్లిలోని హనుమాన్ వ్యాయమశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలసి సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్.. నిర్మల్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో గల పోలింగ్ బూత్‌లో జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి.. సిద్దిపేట పట్టణం నాసర్‌పురా ఉర్థూ మీడియం స్కూల్లో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోగా..అడిషనల్ కమిషన్ ఆఫ్ పోలీస్ స్వాతీ లక్రా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
తెలంగాణ, హైదరాబాద్, ఎన్నికలు, ప్రభుత్వ అధికారులు, ఓటుహక్కు, వినియోగం,జీహెచ్‌ఎంసీ, కమిషనర్, దానకిశోర్,కమిషనర్ ఆఫ్ 

Don't Miss