యడ్యూరప్పకు గవర్నర్ పిలుపు..రేపే ప్రమాణస్వీకారం..

20:41 - May 16, 2018

కార్ణటక : రాష్ట్రంలో రాజకీయాలపై ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ తన బీజేపీ వైపే మొగ్గుచూపారు. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా బీజేపీ ఎమ్మెల్యే అయిన యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అధికారికంగా రాజ్‌భవన్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లుగా తాజా సమాచారం. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప గురువారం ఉదయం 9.30 గంటలకు కొత్త సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా రాజ్ భవన్ లోనే యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణకు ఈనెల 26 వరకూ గడువిచ్చారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 112 మంది సభ్యులను అసెంబ్లీలో చూపించాలి. అయితే.. ప్రస్తుతం బీజేపీకి 104 సీట్ల బలం మాత్రమే ఉంది. బల నిరూపణ తర్వాతే కేబినేట్ విస్తరణ ఉండనుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. 

Don't Miss