‘స్పైడర్' లో గ్రాఫిక్స్...!

15:02 - July 14, 2017

గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ , బాలీవుడ్ మాత్రమే కాదు..తెలుగు సినిమా చూస్తే గ్రాఫిక్స్ అంటే తెలుస్తుందని బాహ్యా ప్రపంచానికి తెలియచెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. గ్రాఫిక్స్ తో థియేటర్ల వద్దకు ప్రేక్షకులను రప్పించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. విమర్శకుల చేత ఔరా అనిపించుకున్న సందర్భాలున్నాయి. టాలీవుడ్ లో కూడా గ్రాఫిక్స్ లతో పలు సినిమాలు నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు'..మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది. మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. షూటింగ్ మొదలు పెట్టి ఇప్పటికే సంవత్సరం పూర్తయ్యింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు బయటకు రాలేదు. దీనితో ‘మహేష్’ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అనంతరం చిత్ర పోస్టర్..టీజర్ ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయ త్నం చేశారు. తాజాగా 'స్పైడర్' లో గ్రాఫిక్స్ సన్నివేశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకనే చిత్ర రిలీజ్..ఇతరత్రా విషయాల్లో లేట్ అవుతుందని తెలుస్తోంది.

ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ చూస్తే నిజమే అనిపించక మానదు. ఆరు దేశాల్లో గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ చేస్తున్నట్లు టాక్. రెండు పాటల్లో ఒక పాటను ఇటీవలే పూర్తి చేశారని, ఆగస్టు నెలలో మరో పాట షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 27న 'స్పైడర్' రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరీ 'మహేష్' ‘స్పైడర్' లో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

Don't Miss