బీజెపీ గుండెల్లో గుబులు రేపుతున్న గుజరాత్ ఎన్నికలు

20:28 - November 23, 2017

గుజరాత్ ఎన్నికలు బీజెపీ గుండెల్లో గుబులు రేపుతున్నాయా?పరిస్తితి రివర్స్ లో కనిపిస్తోందా?కొన్నేళ్లుగా సాగుతున్న కమలం వెలుగులు మసకబారుతున్నాయా?అందుకే బీజెపీ ఇప్పుడు కంగారు పడుతోందా? అవునంటున్నాయి విపక్షాలు.. గుజరాత్ లో ఏం జరుగుతోంది? బీజెపీ, కాంగ్రెస్ మధ్యలో పాటీదార్లు ....ఈక్వేషన్ ఎలా మారుతోంది? ఎన్నికలు, అధికారం దీని చుట్టూ రాజకీయ పక్షాల ఎత్తులు పై ఎత్తులూ సాగుతుంటాయి. ఇప్పుడు బీజెపీ ఆలోచనంతా గుజరాత్ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. భారత ప్రధాని కాస్తా గుజరాత్ లోకల్ నేతగా మారిన తీరు.. బీజెపీ అధికారం నిలబెట్టుకోటానికి వేస్తున్న ఎత్తులు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయా?

మాకు ఎదురే లేదనే ధీమా ప్రదర్శించే మోడీ అండ్ టీమ్.. ఇప్పుడు టెన్షన్ పడుతున్న సీన్ కనిపిస్తోంది. గుజరాత్ లో గెలుపోటములపైనే మోడీ, అమిత్ షాల భవిష్యత్ ఆధారపడి ఉందా? గుజరాత్ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వస్తే బీజేపీలో ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం విన్పించే అవకాశాలున్నాయా? అందుకే గుజరాత్ ఎన్నికలను మోడీ, షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? ముఖ్యంగా మోడీ , అమిత్ షా సొంత రాష్ర్టం కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా మారిందా?గుజరాత్ ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే, వేడెక్కిన గుజరాత్‌ రాజకీయం ఇప్పుడు మరింత హాట్ హాట్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు అమల్లోకి తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, జీఎస్టీని గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌గా అభివర్ణిస్తుంటే, కాంగ్రెస్‌ నాటకాల పార్టీగా మారిందని బీజెపీ అంటోంది. మరోపక్క పాటీదార్ లు బీజెపీ సవాల్ గా మారుతున్న తీరు కనిపిస్తోంది. మరోపక్క బీజెపీని అసమ్మతి సెగ కమ్ముకుంటోంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు మోడీ సర్కారుకు సెమీ ఫైనల్ లా మారాయి. గుజరాత్ లో కనిపిస్తున్న ప్రతికూలతలు, కమలదళాన్ని కలవర పరుస్తున్నాయి. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టు...ఈ మూడున్నరేళ్లుగా మోడీ తీసుకున్న పలు నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనిపించనుందనే వాదనలు పెరుగుతున్నాయి. కీప్ వాచింగ్ టెన్ టీవీ. న్యూస్ ఈజ్ పీపుల్. 

Don't Miss