గండ్లమాచనూరులో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

18:15 - February 17, 2017

సంగారెడ్డి : జిల్లాలోని గండ్లమాచనూరులో సైరెక్స్‌ కంపెనీ కాలుష్యంపై స్థానికులు తీవ్రస్థాయిలో స్పందించారు. కంపెనీ విస్తరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణలో తమ అభిప్రాయాలను సూటిగా చెప్పారు. ప్రజల ప్రాణాలు తీస్తూ ధనార్జనే ధ్యేయంగా పరిశ్రమల యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రజల తరపున కాకుండా పరిశ్రమల తరపున కాలుష్య నియంత్రణ అధికారులు పనిచేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అభిప్రాయ సేకరణ జరుగుతుండగానే గ్రామస్తులు పరిశ్రమల విస్తరణకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగించారు. పరిశ్రమల కాలుష్యంవల్ల ఇక్కడి అబ్బాయిలతో పెళ్లికి అమ్మాయిలు ముందుకు రావడంలేదని ఆరోపించారు.

 

Don't Miss