చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఎయిడ్స్....

15:05 - December 1, 2017

ఎక్కడో అఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని వణికించిన వ్యాధి హెచ్ఐవీ ఎయిడ్స్ ఈ వ్యాధికి మందును ఇంతవరకు కనుగొనలేదు. దీనికి నివరాణ ఒక్కటే మార్గం. ఎయిడ్స్ భారతదేశాన్ని వణికించింది. ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధి కేసులు తగ్గుతున్న అక్కడక్కడ బయట పడుతుండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. అయితే ఈ వ్యాధి వచ్చినవారు క్రమం తప్పకుండా మందులు వాడితే వారి జీవన ప్రమాణం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. హెచ్ఐవీ అనే ఈ ప్రాణంతక వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మానవ రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా మనిషికి ఏ చిన్నగా గాయామైన, జ్వరం వచ్చిన తగ్గదు. ఇక తెలంగాణ రాష్ట్ర వియానికొస్తే నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్థసంవత్సరంలో 2,84,180 ఎలీసా పరీక్షలు చేసుకోగా అందులో 5,789 కేసులు పాజిటివ్ అని తెలింది. గత ఏడాది 5,87,738 మందికి పరీక్షలు చేయగా 11,043 మంది ఎయిడ్స్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.94 శాతం పెరిగే అవకాశలు కనిపిస్తున్నాయి.

జిల్లాల వారిగా చూస్తే...
తెలంగాణలో జిల్లాల వారిగా చూస్తే ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువ గల జిల్లాల్లో హైదరాబాద్ ముందు ఉంది. మెదక్ జిల్లాలో 19,335 మంది పరీక్షించుకోగా అందులో 574 మందికి హెచ్ఐవీ ఉందని తేలింది. నల్లగొండలో 27,812 మంది పరీక్షలు చేసుకొగా 738 మందికి వ్యాధి బయపడింది. హైదరాబాద్ లో 1024 మంది ఎయిడ్స్ వచ్చిన్నట్టు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కొత్త జిల్లావారిగా చూస్తే సిరిసిల్ల, సంగారెడ్డి, జగిత్యాల మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
మధ్య వయస్సు వారే ఎక్కువగా...
కొత్త ఎయిడ్స్ బారిన పడుతున్న వారిలో చాల వరకు 40 పై వారే ఉంటున్నారు. కొంత మంది 40 ఏళ్లు దాటగానే వాళ్ల పిల్లలు సెటిలైన తర్వాత ఈజీ మనీ కోసం అసంఘీక కార్యక్రమాలకు పునుకుంటున్నారు. నలభైకి చేరుకున్న వ్యాధి బారిన ఫర్వాలేదన్న ధీమాతో ఉన్నట్లు ఆధ్యయనంలో వెల్లడైయింది. గతంలో ఎయిడ్స్ వాస్తే ఎవరిక చెప్పుకునేవారు కాదు, వారిక సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఎదురైయ్యేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ వ్యాధి వచ్చిన వారు దాదాపు 10 నుంచి 20 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. ఎయిడ్స వ్యాధి బారిన పడుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాలవారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
వ్యభిచారుల్లో తగ్గుతున్న వ్యాధి తీవ్రత....
రాష్ట్రంలో న్యాకో లెక్కల ప్రకారం హైరిస్క్ స్టేజిలో ఉన్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 2016,2017 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56, 086 మంది సెక్స్ వర్కర్స్ ఉండగా వారిలో 12,417 మంది స్వలింగ సంపర్కులు(హోమో సెక్స్) ఉన్నారు. 1,015 మంది మత్తు బానిసలు, 311 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. వీరిలో చాల మంది నిత్యం హెచ్ఐవీ టెస్టులు చేయించుకుంటున్నారు. కండోమ్స్ వాడితేనే వారు శృంగారానికి అంగీకరిస్తున్నారు. 

Don't Miss